ప్రాణాలు పోతున్నా.. క్షణాల్లో కొడుకును కాపాడింది..! | Oneindia Telugu
Oneindia Telugu · Uploaded
Archive snapshot
Wezual recorded ప్రాణాలు పోతున్నా.. క్షణాల్లో కొడుకును కాపాడింది..! | Oneindia Telugu by Oneindia Telugu in 1 archive market in 2018. See the recorded views and likes by market and year.
- Selected record
- India · 2018
- Recorded views
- 1.2m
- Recorded likes
- 5.2k
Description from YouTube
A mother saved his son from bus misshap in Visakhapatnam district on Wednesday. \n \nవిశాఖ జిల్లాలో తన కొడుకు ప్రాణాలను రక్షించుకునేందుకు ఓ తల్లి ప్రాణత్యాగం చేసింది. తెలుగులో వచ్చిన బాహుబలి సినిమాలో శివగామిలా తన ప్రాణాలు పోతున్నా.. తన కొడుకును రక్షించుకోవడం విఫలం కాలేదు. \nఈ ఘటన జిల్లాలోని సబ్బవరం మండలం పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. తల్లి మరణంతో ఆమె కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. \nపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సబ్బవరం మండలం పైడివాడ గ్రామానికి చెందిన బండ శ్రీను (25), గౌరి (25) దంపతులకు కుశాలవర్ధన్ (4), హేమరఘురాం (2) ఉన్నారు. పిల్లలతో కలిసి సంక్రాంతి పండగ కోసం మూడు రోజుల కిందట పెందుర్తి మండలం గండిగుండంలోని అత్తారింటికి వెళ్లారు. \nపండగ ముగించుకుని బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు. సబ్బవరం శివారు చిన్నయ్యపాలెం టెర్రాకాన్ లేఅవుట్ వద్దకు వచ్చేసరికి వారి బైకుకు వెనుకగా ఆర్టీసీ బస్సు వచ్చింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో వీరి బైక్ను ఆ బస్సు ఢీకొట్టింది. దీంతో శ్రీను, బైక్పై ముందు కూర్చున్న కుశాలవర్ధన్ తూలి రోడ్డుపక్కనే ఉన్న తుప్పల్లో పడిపోయారు. \nగౌరి మాత్రం రెండేళ్ల హేమరఘురాంతోపాటు రోడ్డుపై పడిపోయింది. కాగా, వెనుక ఉన్న ఆర్టీసీ బస్సు తన వైపు దూసుకురావడం ఆమె చూసింది. ఒడిలోని బాబును రెండు చేతులతో పట్టుకుని క్షణాల్లో రోడ్డుపక్కనే ఉన్న తుప్పల్లోకి విసిరేసింది. ఆ వెంటనే రెప్పపాటులో బస్సు వెనుక చక్రాలు ఆమె తలపై నుంచి వెళ్లడంతో గౌరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. \nకాగా, గౌరి భర్త, ఇద్దరు పిల్లలు మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఎంతో ఆనందంగా పండగను జరుపుకుని వస్తుండగా, ఈ ప్రమాదం జరిగి ఇంటి ఇల్లాలు మరణించడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.\nOneindia Telugu\nSubscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.\n▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬\n▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬\n♥ subscribe : https://goo.gl/sp2m54\n♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/\n♥ YouTube : https://goo.gl/sp2m54 \n♥ Website : http://telugu.oneindia.com\n♥ twitter: https://twitter.com/thatsTelugu\n♥ GPlus: https://plus.google.com/+OneindiaTelugu\n♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/\n▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Recorded Trending History
| Market | Year | Category | Views | Likes | Likes per view | Measurement |
|---|---|---|---|---|---|---|
| India | 2018 | News & Politics | 1.2m | 5.2k | 0.43% | Historical snapshot |
How to interpret these archive records
The earliest archive year we have for this video is 2018, with a record in India. Its largest stored historical view total is 1.2m in the India 2018 archive. That record has 5.2k likes and a like-to-view ratio of 0.43%.
Each record pairs likes and views from the same record. A higher ratio describes more recorded likes per view, and repeat views can affect the result. A missing or zero like count may reflect unavailable source data, so the ratio is shown as unavailable.



